కోనాపూర్‌లో ఘనంగా దుర్గమ్మ వేడుకలు
నూతన దుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ.. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్థులు
తెలుగు ట్రెండ్స్, కొల్చారం:
మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో నూతన దుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం, ఉపసర్పంచ్ మురళీధర్ రావు, కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు మనసంపల్లి వెంకటేశం, రమేష్, చక్రల సిద్ధిరాం రెడ్డి, మాణిక్య రెడ్డి, బాపురెడ్డి పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మహిళలు, పురుషులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో కార్యక్రమం సందడిగా సాగింది. నూతన దుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

