Type Here to Get Search Results !

సిరిపురం సబ్‌స్టేషన్ వద్ద తెల్లారాళ్ల తండా రైతుల ధర్నా.. నిరంతరాయ త్రీఫేజ్ విద్యుత్ కోసం డిమాండ్

 



హత్నూర, అక్టోబర్ 7, తెలుగు ట్రెండ్స్: హత్నూర మండలంలోని తెల్లారాళ్ల తండాకు చెందిన రైతులు సిరిపురం సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ పనులకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిపురం సబ్‌స్టేషన్ అధికారులను కలిసి తమ సమస్యలను వివరించి, వెంటనే పరిష్కరించాలని కోరారు.

వ్యవసాయానికి అవసరమైన మేరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెల్లారాళ్ల తండాకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language