దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలి: ఆవుల రాజిరెడ్డి
తెలుగు ట్రెండ్స్ న్యూస్, శివ్వంపేట, అక్టోబర్ 17:
దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి ఆకాంక్షించారు.
శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం గడ్డం కార్తీక్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి కృపతో పంటలు సమృద్ధిగా పండి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. మండల ప్రజలు, రైతులు పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పండుగలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పెద్దపట్లోరి మాధవరెడ్డి, సీనియర్ నాయకులు నవీన్ గుప్త, సర్పంచ్ కుమ్మరి హైమవతి, ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీధర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్, నాగరాజు, మంగలి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ న్యూస్
