Type Here to Get Search Results !

జీవో 25తో ఉపాధ్యాయుల ఇక్కట్లు.. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: మంత్రి వివేక్‌కు ఎస్జీటీయూ నేత అరికిల వెంకటేశం వినతి

 


జీవో 25తో ఉపాధ్యాయుల ఇక్కట్లు.. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఎస్జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల వెంకటేశం వినతి

తెలుగు ట్రెండ్స్ న్యూస్, వెల్దుర్తి మండలం, అక్టోబర్ 17:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించాలంటే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్జీటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

జీవో 25 అమలుతో ఇబ్బందులు

జీవో నంబర్‌ 25 అమలు నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు అరికిల వెంకటేశం తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి తరగతికి సరిపడా ఉపాధ్యాయులను కేటాయించి, విద్యార్థుల అభ్యసనానికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మార్పులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని వెంకటేశం కోరారు. ఉపాధ్యాయులకు అనుకూలమైన బోధనా వాతావరణం కల్పించడంతో పాటు, తరగతి గదుల్లో విద్యాబోధన సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అరికిల వెంకటేశం పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమైతే విద్యాబోధన మరింత మెరుగుపడి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.

ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎస్జీటీయూ తెలంగాణ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు ట్రెండ్స్ న్యూస్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language