Type Here to Get Search Results !

ఫైజాబాద్ దుర్గామాతను దర్శించుకున్న హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలుముల ప్రతాపరెడ్డి

 



ఫైజాబాద్ దుర్గామాతను దర్శించుకున్న హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలుముల ప్రతాపరెడ్డి

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు

తెలుగు ట్రెండ్స్, చిలిపిచెడ్, అక్టోబర్ 18:

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన శ్రీ దుర్గామాతను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిలుముల ప్రతాపరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండి రైతులు అభివృద్ధి చెందాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తలారి మైపాల్, కమిటీ సభ్యులు, ఫైజాబాద్ గ్రామ సర్పంచ్ రాములు, గ్రామ పెద్దలు ఎం.సి. విటల్, గంగయ్య ఆధ్వర్యంలో చిలుముల ప్రతాపరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఫైజాబాద్ గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language