Type Here to Get Search Results !

కోనాపూర్‌లో అభివృద్ధి జోరు.. పేదలకు సంక్షేమ భరోసా

 

కోనాపూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

బస్టాండ్‌కు శంకుస్థాపన.. మహిళా సమైక్య భవనం ప్రారంభం.. పేదలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రామాయంపేట, అక్టోబర్ 5 (తెలుగు ట్రెండ్స్): రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామంలో వి



స్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు అర్హులైన పేద లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను అందించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సాధికారత లక్ష్యంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కోనాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో 16 గ్రామాలకు చెందిన అర్హులైన పేద లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని సర్పంచ్ కిచ్చయ్య వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రామాయంపేట మండల తహసీల్దార్ రజినీ కుమారి, ఎంపీడీవో షాజలోద్దీన్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language