చిలిపిచెడ్. అక్టోబర్ 9 తెలుగు ట్రెండ్ న్యూస్
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో మంజీరా నది తీరాన వెలిసిన చాముండేశ్వరీ దేవీ ఆలయం ఎంతో విశిష్టత, చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి 19వ తేదీ సోమవారం వరకు ఆలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ తెలిపారు.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యుడు శోభన్ బాబు కోరారు.
