చిలిపిచెడ్, అక్టోబర్ 9 తెలుగు ట్రెండ్ న్యూస్
చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్ పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు ఉషశ్రీ మాట్లాడుతూ.. "బతుకమ్మ అంటేనే పూల జాతర. ప్రపంచంలోనే పువ్వులను దేవతగా కొలిచే సంప్రదాయం తెలంగాణకు మాత్రమే పరిమితం. ఆడపడుచులు తమ కష్టసుఖాలను పాటల రూపంలో తెలియజేస్తూ ఆటపాటలతో జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ" అని అన్నారు.
మరో ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ.. విద్యార్థులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయడం ఎంతో అవసరమని, ప్రతి పండుగ ప్రాముఖ్యతను వారికి వివరించాలని అన్నారు. పండగ అంటే అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవడమేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

