భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి
రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు
వరంగల్, అక్టోబర్ 13: తెలంగాణ శాసనసభ మాజీ ఉపసభాపతి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి మంగళవారం వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో కలిసి ఆలయానికి
చేరుకున్న ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పద్మా దేవేందర్‌రెడ్డికి ఘనంగా సన్మానం చేసి, అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు
ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

