Type Here to Get Search Results !

మెదక్ సీబీఎస్‌ చందన బ్రదర్స్‌లో సినీనటి పాయల్ రాజ్‌పుత్ సందడి.. దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభం

 మెదక్‌లో సీబీఎస్ షాపింగ్ మాల్‌లో దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభం


సినీనటి పాయల్ రాజ్‌పుత్ సందడి.. ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక బహుమతులు


తెలుగు ట్రెండ్స్, మెదక్, అక్టోబర్ 9: మెదక్ పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (సీబీఎస్‌)లో దసరా డబుల్ ధమాకా సేల్‌ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మెదక్ చర్చి సమీపంలో ఉన్న షోరూంలో సినీనటి పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా పాల్గొని సేల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేయడంతో షాపింగ్ మాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.


ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ మెదక్‌కు రావడం, సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లకు అవసరమైన దుస్తుల కోసం తాను సీబీఎస్‌లో షాపింగ్ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే విభిన్న డిజైన్లు, వస్త్రాల వెరైటీలు తనను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు.


సీబీఎస్‌ మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్ మాట్లాడుతూ తమ సంస్థకు 40 ఏళ్ల అనుభవం, వినియోగదారులతో అనుబంధం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థను విస్తరిస్తూ, ప్రతి ప్రాంత ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. మెదక్ ప్రజల కోసం ప్రత్యేకంగా దసరా డబుల్ ధమాకా సేల్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.


అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్ దుస్తులను అందించడమే తమ లక్ష్యమని జానా సురేష్ పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగలతో పాటు షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.


ప్రారంభోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్‌కు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు చీరలు, ఇతర వస్త్రాలను ఆసక్తిగా పరిశీలించి కొనుగోళ్లు చేశారు. ప్రత్యేక ఆఫర్లతో షోరూం సందడిగా మారింది.


సీబీఎస్‌ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా డబుల్ ధమాకా సేల్‌ ద్వారా పండుగ కొనుగోళ్లకు వచ్చే వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహ



కులు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language