Type Here to Get Search Results !

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో.. నార్సింగి సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా

 అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర.. నార్సింగి సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా


చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన.. మెదక్‌–బోడ్మట్‌పల్లి రహదారిపై రాస్తారోకో


తెలుగు ట్రెండ్స్, పాపన్నపేట, అక్టోబర్ 9: అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి సబ్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు మెదక్‌–బోడ్మట్‌పల్లి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతులకు సమయానికి విద్యుత్ సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.


విద్యుత్ శాఖ ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ నర్సింలు నిరసన స్థలానికి వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం విద్యుత్ అధికారులకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.


ఈ ఆందోళనలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మణ్, భరత్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాష్ట్ర బీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్, జిల్లా నాయకులు దిశా కమిటీ సభ్యుడు ఎంఎల్‌ఎన్ రెడ్డి, బిక్షపతి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్, ఆకుల ప్రభాకర్, చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు రాజు, హవేలీ ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు శ్రీను, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు సూరిబాబు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బీకొండ రాములు, పాపన్నపేట మండల కన్వీనర్, నార్సింగి ఉపసర్పంచ్ శ్రీరామ్ నరేష్, ఆకుల సుధాకర్, పాపన్నపేట ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, వెంకట్, బుల్లెట్, సాయిబాబా, మల్లేశం, కొంపల్లి లక్ష్మణ్, గోపాల్, పాపన్నపేట మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు సిద్ధిరాములు, పట్టణ అధ్యక్షుడు సుంకరి కిష్టయ్య, మండల నాయకులు బైండ్ల దుర్గయ్య, శంకర్ గౌడ్, కుమార్, చంద్రశేఖర్, యువమోర్చా నాయకుడు రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొని విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించాలని డిమాం



డ్ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language