Type Here to Get Search Results !

పాపన్నపేటలో పోషకాహార మేళా.. ఘనంగా నిర్వహణ

 పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా


25 స్టాళ్లలో ఆకట్టుకున్న పోషక విలువలతో కూడిన ఆహార వంటకాలు


పాపన్నపేట, అక్టోబర్ 08 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం పోషకాహార మేళా (ఫుడ్ ఫెస్ట్) ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, డీఐఈఓ ఆదేశాల మేరకు కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


మేళాలో మొత్తం 25 స్టాళ్లను ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే వివిధ రకాల ఆహార వంటకాలను విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఫుడ్ ఫెస్ట్‌ను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు జ్యోతి ప్రజ్వలన చేశారు.


ఈ సందర్భంగా విద్యార్థులకు రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిన పోషక విలువలు, స్థానికంగా లభించే ఆహార పదార్థాల ప్రాధాన్యత, వాటి ద్వారా లభించే పోషకాలు, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ పోషకాహార వంటకాలను రుచి చూసి వాటి నాణ్యతను పరిశీలించారు.


పోషక విలువలు కలిగిన స్థానిక ఆహార పదార్థాలతో ఉత్తమంగా వంటకాలు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


పోషణ మాసం ముగింపు సందర్భంగా కూరగాయలతో బతుకమ్మను ఏర్పాటు చేసి, బోనం నిర్వహించడం ద్వారా జిల్లాలో చేపట్టిన పోషణ మాసం, ఫుడ్ సేఫ్టీ కార్యక్రమాలకు ముగింపు పలికారు.


కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమభార్గవి, సీడీపీఓ వెంకట రమణ, పాపన్నపేట సూపర్‌వైజర్లు, సీడబ్ల్యూసీ మెంబర్ కె. ఉప్పలయ్య, డీసీపీఓ నాగరాజు, పోషణ మాసం ప్రోగ్రాం ఇన్‌చార్జి, జూనియర్ లెక్చరర్ జి. శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు జి. సతీష్, జె. శ్రీనివాస్, ఎస్. సంతోష్ కుమార్, బి. ప్రవీణ్ కుమార్, సంధ్యారాణి, బి. రమేష్, కె. నవీన్ కుమార్, టి. ప్రణీత్ రెడ్డి, బి. మధుసూదన్, టి. దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు ధన్య



వాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language