Type Here to Get Search Results !

మెదక్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జానకిరామ్ గౌడ్ ఎన్నిక ప్రజాసేవకు మరింత అంకితమవుతా: జానకిరామ్ గౌడ్

 


రెడ్‌క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జానకిరామ్ గౌడ్

తూప్రాన్/మనోహరాబాద్, అక్టోబర్ 4 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తూప్రాన్‌కు చెందిన జానకిరామ్ గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో సభ్యుల మద్దతు లభించడంతో ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకిరామ్ గౌడ్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేదలు, నిరుపేదలు, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. జానకిరామ్ గౌడ్ మెదక్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నిక కావడం పట్ల తూప్రాన్ పట్టణానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language