Type Here to Get Search Results !

తుక్కాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 134 మందికి వైద్య పరీక్షలు

 తుక్కాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం


కొల్చారం, తెలుగు ట్రేండ్స  అక్టోబర్ 7: మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్ వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించింది.


గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సింధు హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్‌లతో పాటు వైద్య సిబ్బంది గ్రామస్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ తదితర వ్యాధులకు పరీక్షలు చేశారు.


వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులుతో పాటు సుమారు 134 మంది గ్రామస్థులు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని తదుపరి చికిత్స కోసం సింధు హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.


సింధు ఆసుపత్రి చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సింధు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు.


ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సింధు హాస్పిటల్ వైద్య సిబ్బందికి సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆరె రవీందర్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పా



ల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language