Type Here to Get Search Results !

వినాయక మండపం వద్ద స్నేహ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

 


పాపన్నపేట స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

పాపన్నపేట, సెప్టెంబర్ 16 (తెలుగు ట్రేండ్స్):
పాపన్నపేట మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూత్ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంపొందించవచ్చని తెలిపారు.

అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు సాదరంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు స్నేహ యూత్ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బెస్త ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉప్పరి యోగేష్, కార్యదర్శి రఘుపతి గంగాధర్, సలహాదారు శాంతపురం కిరణ్, యూత్ సభ్యులు భూపతి హనుమంతు, బెస్త శ్రీశైలం, బెస్తలాలు, రంగంపేట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language