Type Here to Get Search Results !

బద్దాపురం రాములు కుటుంబానికి చేనేత సహకార సంఘం ఆర్థిక సాయం

 


బద్దాపురం రాములు కుటుంబానికి చేనేత సహకార సంఘం ఆర్థిక సహాయం

పాపన్నపేట, సెప్టెంబర్ 16 (తెలుగు ట్రేండ్స్):
పాపన్నపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘం సభ్యుడు బద్దాపురం రాములు బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పద్మశాలి సంఘం సభ్యులు, చేనేత కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాములు మృతి విషయం తెలుసుకున్న పాపన్నపేట చేనేత సహకార సంఘం ప్రతినిధులు, పద్మశాలి కులస్తులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

అనంతరం రాములు అంత్యక్రియల నిర్వహణకు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన చేనేత సహకార సంఘం సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వళ్లందేశీ శ్రీనివాస్, నాయకులు కల్లేటి సంగమేశ్వర, కొడపాక శివశంకర్, బద్దాపురం సంగమేశ్వర, పల్లె సంగమేశ్వర, పల్లె రాజు, కల్లేటి యుగంధర్, పడిగే కిష్టయ్యతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language