Type Here to Get Search Results !

నాగుల చెరువు సుందరీకరణకు అడుగులు

 


నాగుల చెరువు సుందరీకరణకు అడుగులు

చెరువు కట్ట వెడల్పు.. వాకింగ్‌ ట్రాక్‌, లైట్లు, బెంచీలు, మొక్కల ఏర్పాటుకు ప్రణాళిక

నర్సాపూర్, సెప్టెంబర్ 15 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
నర్సాపూర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాగుల చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్‌ సుమతి శివకుమార్‌ ఆధ్వర్యంలో చెరువు కట్టను అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఇప్పటికే చెరువు కట్టను వెడల్పు చేసేందుకు కట్టపై మొరం పోసి చదును చేసి అవసరమైన మేరకు కట్టను విస్తరించారు. కట్టపై విద్యుత్‌ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో కూడా ప్రజలు కట్టపై రాకపోకలు సాగించేందుకు, వాకింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.

నాగులపల్లి గ్రామస్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసుకునేందుకు వీలుగా కట్టపై అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. ప్రజలు సేదతీరేందుకు వీలుగా కట్ట వెంబడి వివిధ రకాల మొక్కలను నాటడంతో పాటు కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

చెరువును సుందరీకరణ చేసి గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా, భవిష్యత్‌లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సర్పంచ్‌ సుమతి శివకుమార్‌ తెలిపారు. పచ్చదనం పెంచడం, ప్రజలకు వాకింగ్‌ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామానికి మరింత అందం చేకూరుతుందని అన్నారు.

నాగుల చెరువు కట్ట మీదుగా తునికి, నల్లపోచమ్మ దేవాలయంతో పాటు పరిసర గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్డును కూడా కట్ట వెడల్పుకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్‌ తెలిపారు.

ఈ అభివృద్ధి పనులకు నర్సాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్‌ సహకారం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. చెరువు కట్ట అభివృద్ధి పూర్తయితే గ్రామ ప్రజలకు నడక, విశ్రాంతి, ఆహ్లాదానికి అనువైన వాతావరణం ఏర్పడటంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language