పంచభక్ష పరమాన్నలతో గణేష్ కి నైవేద్యం
మనోహరాబాద్, (తెలుగు ట్రెండ్స్ )
మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బొజ్జ గణపయ్యకు పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వినాయక ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి రాయల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతి రోజు ప్రత్యేక ఆకర్షణలో మహిళలు పూజలు చేస్తున్నారు. శుక్రవారం పురస్కరించుకుని మహిళలు వినాయకుడికి పలు రకాల వంటకాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గణేష్ ఉత్సవాలులో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
