ఫైజాబాద్లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం.. పోషకాహారంపై అవగాహన
చిలిపిచెడ్, సెప్టెంబర్ 25 (తెలుగు ట్రెండ్స్): మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శశికళ, ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం ఎంతో అవసరమని అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలను చేర్చుకోవాలని సూచించారు.
చిన్నారుల్లో రక్తహీనత, తక్కువ బరువు వంటి సమస్యలు రాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

