రెడ్డిపల్లిలో ఘనంగా కుంకుమార్చన
భక్తిశ్రద్ధలతో శ్రీ గణపతి స్వామికి ప్రత్యేక పూజలు
నర్సాపూర్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గణపతి స్వామి సన్నిధిలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మావతి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలో పాల్గొని గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ తెలిపారు. గ్రామంలో ఐక్యత, ఆధ్యాత్మిక భావన పెంపొందేలా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఎస్వీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతతో పాటు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవం
తం చేశారు.
