పాపన్నపేటలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
మండల స్థాయిలో చదవడం, రాయడం, వ్యాస రచన పోటీలు
మెదక్, సెప్టెంబర్ 08 (
తెలుగు ట్రెండ్స న్యూస్ )
తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలో మండల స్థాయి చదవడం, రాయడం, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా, మండల పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభాధ్యక్షుడు మహేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ యాసకు ప్రత్యేకమైన గొప్పతనం ఉందని అన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో భాషపై ఆసక్తిని పెంచడంతో పాటు వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
మండల స్థాయిలో నిర్వహించిన చదవడం పోటీల్లో సహస్ర (పొడిచన్పల్లి), శ్రీవల్లి (గాజులగూడెం), అక్షిత (ఎల్లాపూర్), శ్రీహిత (కొంపల్లి), అరిద్య (కుర్తివాడ) ప్రతిభ కనబరిచారు.
రాయడం పోటీల్లో భావన (పొడిచన్పల్లి), నిశాంత్ (దౌలాపూర్), వైష్ణవి (అరెపల్లి), మణి వర్షిత్ (ఎల్లాపూర్), కే. శ్రావ్య (శానాయిపల్లి) పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
వ్యాస రచన పోటీల్లో నేహా (యూసుఫ్పేట), వైష్ణవి (పాపన్నపేట), సహస్ర (అన్నారం) విజేతలుగా నిలిచారు. కళాశాల విభాగంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఆలేఖ్య ప్రథమ స్థానం, వైష్ణవి ద్వితీయ స్థానం, శిరీష తృతీయ స్థానం సాధించారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంజీర విద్యా కళా వేదిక ప్రతినిధులు నవీన్ కుమార్, సురేష్, శివ, కుర్తివాడ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు నాగరాజు, బాలరాజు, పంతుల రాజు, భూషణం, రాజశేఖర్, ఎల్లం, రమేష్, సురేష్, సాయి సిరి, విశ్వనాథ్, యాదయ్య, అనిల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
