నర్సాపూర్లో గణనాథులను దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
పలు గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్
నర్సాపూర్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆదివారం నర్సాపూర్ పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గణపతి మండపాలను సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల పరిధిలోని చింతకుంట, సీతారాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను సందర్శించిన ఆయన.. అక్కడ ప్రతిష్టించిన వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని మార్వాడీ గల్లీ, ఛత్రపతి శివాజీ మండపం, సాయిబాబా ఆలయం వద్ద కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణపతి మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.
ఆయా గ్రామాలు, పట్టణంలోని గణపతి మండపాల నిర్వాహకులు, భక్తులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫొటో రైట్అప్:
చింతకుంటలోని గణపతి మండపంలో ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ తదితరులు.
