Type Here to Get Search Results !

మృతుల కుటుంబాలకు పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శ.. తమ్మాయిపల్లి, మిన్‌పూర్‌లో బాధిత కుటుంబాలకు ధైర్యం

 



మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

తమ్మాయిపల్లి, మిన్‌పూర్ గ్రామాల్లో కుటుంబాలకు పరామర్శ.. ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే

పాపన్నపేట, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండలంలోని తమ్మాయిపల్లి, మిన్‌పూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

తమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ సక్కురు నాయక్ భార్య రుక్కిబాయి శనివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి తమ్మాయిపల్లి గ్రామానికి చేరుకున్నారు. రుక్కిబాయి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు.

అనంతరం మిన్‌పూర్ గ్రామంలో మృతి చెందిన కర్రోళ్ల హన్మయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. హన్మయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారు మనోధైర్యంతో ఉండాలని సూచించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో తమ్మాయిపల్లి గ్రామ ఉప సర్పంచ్ అనిల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, నార్సింగ్ సర్పంచ్ దారబోయిన మల్లేశం, అరికెల మాజీ సర్పంచ్ చిట్యాల కవిత రవీందర్, మిన్‌పూర్ సర్పంచ్ అల్లారం యేసు, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ కుబేరుడు, నాయకులు గోపాల్, కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీనాథరావు, స్రవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language