Type Here to Get Search Results !

‘రంగుల వినాయకులు వద్దు.. మట్టి వినాయకులే ముద్దు’.. విద్యార్థుల భారీ ర్యాలీ

 


మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు పిలుపు

రంగుల వినాయకులు వద్దు.. మట్టి వినాయకులే ముద్దు అంటూ విద్యార్థుల భారీ ర్యాలీ

నర్సాపూర్, సెప్టెంబర్ 12 (తెలుగు ట్రెండ్స్):
ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని నర్సాపూర్ సీఐ రంగకృష్ణ సూచించారు. వినాయక చవితి సందర్భంగా ‘రంగుల వినాయకులు వద్దు.. మట్టి వినాయకులే ముద్దు’ అంటూ నర్సాపూర్ పట్టణంలోని రెండో వార్డు హనుమంతపూర్‌లో ఉన్న గిరిదీపం పాఠశాల విద్యార్థులు శనివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ వరకు కొనసాగింది. విద్యార్థులు చేతుల్లో మట్టి వినాయకుల ప్రతిమలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను పూజించాలని కోరారు.

ర్యాలీ అనంతరం పోలీస్‌స్టేషన్‌ వద్ద సీఐ రంగకృష్ణ విద్యార్థులను అభినందించారు. పర్యావరణ పరిరక్షణపై చిన్న వయసులోనే విద్యార్థులు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించడం ద్వారా నీటి వనరులకు కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని సీఐ పేర్కొన్నారు. ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయకులను వినియోగించాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని, చిన్న వయసు నుంచే ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించుకోవాలని రంగకృష్ణ సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మట్టి వినాయకుల ప్రాధాన్యతను వివరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గిరిదీపం పాఠశాల డైరెక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు మోసిన్, శ్రీనివాసరెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language