Type Here to Get Search Results !

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ తీరు సరికాదు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్

 ఎస్‌ఐఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ తీరు సరికాదు


బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్


తెలుగు ట్రెండ్స్, నర్సాపూర్: ఎస్‌ఐఆర్‌ (SIR) విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థిస్తూ, తెలంగాణలో మాత్రం విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా ఓటర్ల జాబితాలోని అవకతవకలను గుర్తించి ప్రక్షాళన చేయవచ్చని పేర్కొన్నారు.


దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, వేర్వేరు ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి ఉన్న ఓట్లు, ఒకే వ్యక్తికి మూడు చోట్ల నమోదైన ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఉపయోగపడుతుందని మల్లేష్ గౌడ్ తెలిపారు. బీజేపీ దొంగ, బోగస్ ఓట్లను నమోదు చేసే ప్రక్రియకు పాల్పడదని స్పష్టం చేశారు.


ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీకి అభ్యంతరాలు ఉంటే, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇదే వైఖరిని అవలంబించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయా రాష్ట్రాల్లో రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు.


ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు సంగసాని సురేష్, రాగి రాములు, నారాయణ రెడ్డి, రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, జైపాల్, శ్రీనివాస్ గౌడ్, నగేష్, హరీష్, పడిగె దాసు, నర్సింలు, శ్రీకాంత్, కర్రే వెంకన్న, బాలరాజ్, సంజీవరెడ్డి తదితరులు పా


ల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language