Type Here to Get Search Results !

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనలో ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి టీటీడీ ఆహ్వానం మేరకు భక్తి గీతాల ఆలాపన

 తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనలో ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి

టీటీడీ ఆహ్వానం మేరకు భక్తి గీతాల ఆలాపన


తెలుగు ట్రెండ్స్, చిలిపిచెడ్, సెప్టెంబర్ 29: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన శ్రీ హనుమాన్ భజన మండలిని టీటీడీ ఆహ్వానించింది.టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు హనుమాన్ భజన మండలి సభ్యులు నిరంతరాయంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, శ్రీరాముల వారి భక్తి గీతాలను ఆలపిస్తూ స్వామివారి సేవలో పాల్గొన్నారు.అలాగే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు కూడా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భజన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం పట్ల ఫైజాబాద్ హనుమాన్ భజన మండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యఫలం. స్వామివారి సేవలో భజనలు చేసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది” అని భజన మండలి సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భజన మండలి ఉపాధ్యక్షుడు జనార్దన్, సభ్యులు రాములు, సుభాష్, శ్రీశైలం, రవీందర్, మధుసూదన్ గౌడ్, కుమార్తో పాటు ఫైజాబాద్‌కు చెందిన భజన భక్తులు తదితరులు పాల్గొన్నారు 



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language