Type Here to Get Search Results !

మాలల హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా దోరేటి నాగరాజు నియామకం

 



మాలల హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా దోరేటి నాగరాజు

నియామక పత్రం అందజేసిన సమితి వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య

వెల్దుర్తి, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
మాలల హక్కుల సాధన సమితి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెల్దుర్తి మండలానికి చెందిన దోరేటి నాగరాజును నియమించారు. ఈ మేరకు సమితి వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య, ప్రధాన కార్యదర్శి ఆకుల పెంటయ్య ఆధ్వర్యంలో దోరేటి నాగరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య మాట్లాడుతూ.. మాలల హక్కుల సాధన సమితి బలోపేతానికి దోరేటి నాగరాజు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. సమితి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

నూతనంగా నియమితులైన జిల్లా ప్రధాన కార్యదర్శి దోరేటి నాగరాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య, ప్రధాన కార్యదర్శి ఆకుల పెంటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమితి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

మాలల హక్కుల సాధన, సమితి సిద్ధాంతాల ప్రచారం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పనిచేస్తానని నాగరాజు పేర్కొన్నారు. జిల్లాలో సమితిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోతరాజు కుమార్, నర్సగారి నర్సింలు, కిష్టయ్య, రవి, బాలల హక్కుల సాధన సమితి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language