Type Here to Get Search Results !

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు

 


కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు

మెదక్, సెప్టెంబర్ 26 (తెలుగు ట్రెండ్స్): ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించనున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందున జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన పద్మశాలి సంఘం కులబంధువులు, అధ్యక్షులు, కార్యదర్శులు, యువజన సంఘాల నాయకులు, బాపూజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా పద్మశాలి సంఘానికి చెందిన కార్మికులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులు, సోదర సోదరీమణులు తప్పనిసరిగా హాజరు కావాలని మ్యాకల జయరాములు సూచించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language