Type Here to Get Search Results !

కుటుంబ కలహాలతో విషాదం.. చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

 


కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

రెండు రోజులుగా కనిపించని వ్యక్తి.. చెరువులో మృతదేహంగా లభ్యం

మనోహరాబాద్, సెప్టెంబర్ 20 (తెలుగు ట్రెండ్స్):
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహంగా లభ్యమైన ఘటన మనోహరాబాద్ మండలంలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన అబ్బదాసు స్వామి (39) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఆదివారం గ్రామంలోని చిన్న చెరువులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాల కారణంగానే స్వామి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language