Type Here to Get Search Results !

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉమామహేశ్వరి చిట్కుల్ కేజీబీవీ హిందీ సీఆర్టీకి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

 


జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఉమామహేశ్వరి

చిట్కుల్ కేజీబీవీ హిందీ సీఆర్టీకి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

మెదక్, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందిస్తూ, క్రమశిక్షణతో పాటు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న చిట్కుల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హిందీ సీఆర్టీ ఉమామహేశ్వరి 2026 సంవత్సరానికి మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. కేజీబీవీల విభాగం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఆమె ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమామహేశ్వరి 2008 సంవత్సరం నుంచి పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థినుల విద్యాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారు. హిందీ సబ్జెక్టును విద్యార్థినులకు సులభంగా అర్థమయ్యే విధంగా సరళమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ, వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

విద్యార్థినుల్లో క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు విద్యా ఫలితాలను మెరుగుపర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పాఠశాలలో 100 శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, విద్యార్థినుల సామర్థ్యాలను గుర్తించి వారికి తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. బోధనతో పాటు విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసంపై కూడా దృష్టి సారిస్తూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకున్నారు.

ఆమె సేవలను గుర్తించిన అధికారులు తొలుత మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేయగా, ప్రస్తుతం జిల్లా స్థాయిలో కేజీబీవీల తరఫున ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

ఈ నెల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాధికారి రాజు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఉమామహేశ్వరి పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లా స్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రత్యేక అధికారి అంజలితో పాటు సహ ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి విద్యార్థినుల పట్ల ఎంతో శ్రద్ధతో వ్యవహరిస్తూ, వారి విద్యా ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమెకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఉమామహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు ఆకాంక్షించారు. ఆమె సేవలు మరింత మంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

MY HEALTH PHARMACY MEDAK

ప్రకటన
My Health Pharmacy Medak

#codes

Hollywood Movies

🌐 Select Language