Type Here to Get Search Results !

పొడిచన్‌పల్లి పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

 


పొడిచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

మెదక్‌, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను పొడిచన్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి మాట్లాడుతూ.. “అన్యభాషల నేర్చి ఆంధ్రంబు రాదనుచు సఖిలించు ఆంధ్రుడా” అంటూ తెలుగు ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. తెలంగాణ యాస, భాష గొప్పతనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపై ఉందన్నారు.

సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్‌ బి. దేవయ్య మాట్లాడుతూ.. “బడి పలుకుల భాష కాదు.. పలుకు బడుల భాష కావాలి” అని ఆకాంక్షించిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ అని అన్నారు. ‘నా గొడవ’ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై ముక్కుసూటిగా స్పందిస్తూ, తన రచనల ద్వారా ఆనాటి పాలకులను ప్రశ్నించారని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కాళోజీ రచించిన కవితలను ఆలపించి ఆయన సాహిత్య స్ఫూర్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్‌గౌడ్‌, కె. కిషన్‌, కె. శివశంకర్‌, పీడీ కె. మహిపాల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language