Type Here to Get Search Results !

రైతు సంక్షేమమే లక్ష్యం.. మెదక్ జిల్లాలో వెల్దుర్తి పీఏసీఎస్‌కు రెండో స్థానం

 రైతు సంక్షేమమే లక్ష్యం.. పీఏసీఎస్‌ ప్రగతి బాట!


రైతు సేవల్లో వెల్దుర్తి పీఏసీఎస్‌ దూసుకెళ్తోంది.. మెదక్ జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం: చైర్మన్‌ అనంతరెడ్డి

వెల్దుర్తి మండలం, సెప్టెంబర్ 30 (తెలుగు ట్రెండ్స్): రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం, సిబ్బంది, సభ్యులు సమన్వయంతో పనిచేస్తే సహకార సంఘం మరింత బలోపేతమవుతుందని వెల్దుర్తి పీఏసీఎస్‌ చైర్మన్‌ అనంతరెడ్డి అన్నారు. సమష్టి కృషి, సభ్యుల సహకారంతోనే సొసైటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించగలమని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో వెల్దుర్తి సొసైటీ రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో బుధవారం చైర్మన్‌ అనంతరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి, ఆర్థిక లావాదేవీలు, రైతులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్‌ కార్యాచరణపై సభ్యులతో చర్చించారు. రూ.17.64 కోట్ల రుణాల పంపిణీ: సొసైటీ సీఈఓ అశోక్‌ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికను పాలకవర్గం అనుమతితో మహాజన సభలో చదివి వినిపించారు. ఇప్పటివరకు 1,799 మంది సభ్యులకు రూ.15.04 కోట్ల స్వల్పకాలిక రుణాలు, 66 మంది సభ్యులకు రూ.2.60 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 670 టన్నుల ఎరువులు, 200 కాంప్లెక్స్‌ బ్యాగులు, 53 బ్యాగుల పొటాష్‌ విక్రయించినట్లు వివరించారు. వరి ధాన్యం కొనుగోళ్లలోనూ ముందడుగు: యాసంగి సీజన్‌లో వెల్దుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో 18 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించినట్లు సీఈఓ అశోక్‌ తెలిపారు. ఇప్పటివరకు 440.8 మంది రైతుల నుంచి 1,85,867 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు లేకుండా సొసైటీ ఆధ్వర్యంలో గోదాముల ఏర్పాటుపై దృష్టి సారించాలని సభ్యులకు సూచించారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు భవిష్యత్‌లోనూ పీఏసీఎస్‌ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపారు. 57 సమావేశాలు.. సమన్వయంతో ముందుకు: సొసైటీ పరిధిలో ఇప్పటివరకు 57 పర్యాయాలు సమావేశాలు నిర్వహించినట్లు చైర్మన్‌ అనంతరెడ్డి తెలిపారు. ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సిబ్బంది, పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తూ సొసైటీని జిల్లాలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సంఘం లాభాల బాటలో కొనసాగుతోందని, ఇదే స్ఫూర్తితో మరింత పురోగతి సాధిస్తామని పేర్కొన్నారు. సొసైటీ అభివృద్ధికి సహకరిస్తున్న రైతులు, సభ్యులు, పాలకవర్గం, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ మురళి, సొసైటీ డైరెక్టర్లు నాలాచెరువు కిష్టాగౌడ్‌, ఉదండపురం నర్సింలు, హనుమంతరావు, వెంకటరెడ్డి, పోతిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నా



రు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language