Type Here to Get Search Results !

తాగునీటి కోసం వెళ్లి విద్యుత్ షాక్‌తో మహిళ మృతి పాపన్నపేట మండలం చీకోడ్‌లో విషాద ఘటన

 


త్రాగునీటి కోసం వెళ్లి విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బోరుబావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ఘటన

పాపన్నపేట, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
త్రాగునీటి కోసం వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బోరుబావిపై పడి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం శోభారాణి (51) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

గురువారం తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసేందుకు వెళ్లిన శోభారాణి రోజంతా వ్యవసాయ పనులు చేశారు. పని చేసి అలసిపోవడంతో గొంతు తడుపుకునేందుకు త్రాగునీటి కోసం సమీపంలోని మరో వ్యక్తికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బోరుబావిపై పడటంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి కుమారుడు సంపత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలికి కుమారుడు సంపత్ రెడ్డి ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language