Type Here to Get Search Results !

శివంపేటను వేధిస్తున్న కోతుల బెడద.. నివారణకు రూ.5 లక్షలు సొంతంగా ఇచ్చిన మహేష్ గుప్తా

 



కోతుల బెడద నివారణకు సొంత నిధులతో ముందుకొచ్చిన మాజీ జెడ్పీటీసీ

రూ.5 లక్షలు సొంతంగా అందజేసిన పబ్బ మహేష్ గుప్తా.. గ్రామస్థుల కృతజ్ఞతలు

శివంపేట, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కోతుల బెడద నివారణకు తాజా మాజీ జెడ్పీటీసీ, ప్రముఖ సంఘసేవకులు పబ్బ మహేష్ గుప్తా ముందుకొచ్చారు. గ్రామంలో కోతుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామస్థుల విజ్ఞప్తికి ఆయన స్పందించారు.

శివంపేటలో పెద్ద సంఖ్యలో కోతులు సంచరిస్తూ దుకాణదారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇళ్ల పైకప్పులు పాడుచేయడం, కేబుల్ వైర్లు కొరకడం, రహదారులపై వాహనదారులకు అడ్డుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సమస్యను గ్రామస్థులు పబ్బ మహేష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. కోతులకు ఎలాంటి హాని కలగకుండా, నిబంధనల ప్రకారం వాటిని పట్టుకుని జనావాసాలకు దూరంగా అడవి ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

కోతులను పట్టే సిబ్బంది ఇందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియజేయడంతో మహేష్ గుప్తా తన సొంత నిధుల నుంచి ఆ మొత్తాన్ని వెంటనే అందజేశారు. ప్రజల సమస్యను పరిష్కరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడంపై గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ ఇసుగారి మల్లేశ్, పాలకమండలి సభ్యులు, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, గ్రామ పెద్దలు, పీఎంజీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language