పాపన్నపేట, సెప్టెంబర్ 27 (తెలుగు ట్రెండ్స్):
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న జయంతి కార్యక్రమానికి పాపన్నపేట మండలం నుంచి పద్మశాలి సంఘం నాయకులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పాపన్నపేట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కొడపాక విట్టల్ ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్కు బయలుదేరారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత రంగం అభివృద్ధితో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఆయన ఆశయాలు, సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పాపన్నపేట నుంచి హైదరాబాద్కు తరలివెళ్లిన వారిలో చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విట్టల్, ఉపాధ్యక్షుడు పల్లె సంగమేశ్వర, డైరెక్టర్లు దాసరి యాదయ్య, అచుకట్ల గురునాథం, పల్లె లక్ష్మణ్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్, పోల శ్రీనివాస్, పల్లె రాజు, బీకొండ సంపత్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. చేనేత కార్మికులు, పద్మశాలి సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.



