పాపన్నపేటలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
వినాయక మండపం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ
పాపన్నపేట, సెప్టెంబర్ 18 (తెలుగు ట్రెండ్స్):
మండల కేంద్రమైన పాపన్నపేటలోని కుమ్మరి గైన్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా స్నేహ యూత్ అధ్యక్షుడు బెస్త ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఉప్పరి యోగేష్, కోశాధికారి రఘుపతి గంగాధర్, సలహాదారు శాంతపురం కిరణ్, యూత్ సభ్యులు భూపతి హనుమంతు, బెస్త శ్రీశైలం, బెస్తలాలు, రంగంపేట రాజేష్, శాంతపురం రాజు, రఘుపతి రాములు తదితరులు పాల్గొన్నారు.
