Type Here to Get Search Results !

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ భద్రతా చర్యలు.. కొల్చారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

 



వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు

కొల్చారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

కొల్చారం, సెప్టెంబర్ 19 (అక్షర కలం):
వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన కొల్చారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ (జీడీ), పార్ట్‌-1, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ తదితర ముఖ్యమైన రికార్డులను అదనపు ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో సీజ్ చేసి ఉంచిన వాహనాలను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

నిమజ్జనంపై ప్రత్యేక దృష్టి

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెట్రోలింగ్

బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహించాలని అదనపు ఎస్పీ సూచించారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణకు అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫిర్యాదులపై తక్షణ స్పందన

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

కేసులకు సంబంధించిన ఆధారాలను నిబంధనల ప్రకారం ఈ-సాక్ష్యలో నమోదు చేసి భద్రపరచాలని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, పోలీస్ స్టేషన్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

పెండింగ్ నివేదికలను త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అదనపు ఎస్పీ సిబ్బందికి సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ ఆకస్మిక తనిఖీలో మెదక్ రూరల్ సీఐ ఎం. కృష్ణమూర్తి, ఎస్‌ఐ అహ్మద్ మొహినుద్దీన్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language