Type Here to Get Search Results !

పేదల పాలిట భరోసా.. సీఎం రిలీఫ్ ఫండ్ చేయూత! ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో బాధితుడికి ఆర్థిక సాయం

 


పేదల పాలిట భరోసా.. సీఎం రిలీఫ్ ఫండ్ చేయూత

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో బాధితుడికి ఆర్థిక సాయం

రామాయంపేట: ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) అండగా నిలుస్తోందని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అన్నారు.

రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ రిపోర్టర్ కట్ట ప్రభాకర్‌కు అనారోగ్య కారణాలతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అందజేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో ఈ ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు చొరవ అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఆయన సహకారంతో రామాయంపేట ప్రాంతానికి చెందిన పలువురు పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక చేయూత అందుతోందని తెలిపారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాకి శ్యామల స్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు చింతల సప్నా స్వామి, మట్టి యాదగిరి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language