Type Here to Get Search Results !

చందంపేటలో గురువులకు ఘన సత్కారం.. విద్యా వెలుగులకు గ్రామం వందనం!

 


గురువులకు ఘన సత్కారం.. విద్యా వెలుగులకు గ్రామం వందనం..!

చందంపేటలో గురుపూజోత్సవం.. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం

చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 5: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల సేవలు మరువలేనివని చందంపేట గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు.

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి సత్కరించి, గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, సమాజ ప్రగతికి బాటలు వేస్తున్నారని సర్పంచ్ కొనియాడారు. విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయుడికి ప్రత్యేక సన్మానం

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీనివాస్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. విద్యారంగానికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.

సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, విలువలను నింపుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే” అని అన్నారు.

ప్రతి విద్యార్థి ఎదుగుదల వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి ఉంటుందని, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గురువులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరసింహులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, రామానుజపురం ప్రభాకర్, గైక్వాడ్ శ్రీనివాస్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలుగు ట్రెండ్స్ న్యూస్ | చిన్నశంకరంపేట మండలం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language