మోటార్ ముట్టుకుంటే.. మృత్యువు కాటేసింది
వ్యవసాయ పొలంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో శ్రీకాంత్ మృతి
*వెల్దుర్తిమండలం,సెప్టెంబర్ 05(తెలుగు ట్రేండ్స్ న్యూస్ ):*
వెల్దుర్తి: వ్యవసాయ పొలంలో మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన విషాద ఘటన వెల్దుర్తి మండల పరిధిలోని మానేపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.
మానేపల్లి గ్రామానికి చెందిన రిక్కం శ్రీకాంత్(30) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో వరి పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న వెల్దుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించామని వెల్దుర్తి ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు

