Type Here to Get Search Results !

మెదక్ కేథడ్రల్‌లో ఘనంగా 80వ CSI ఫార్మేషన్ డే వేడుకలు



 మెదక్ కేథడ్రల్‌లో ఘనంగా CSI ఫార్మేషన్ డే వేడుకలు


80 ఏళ్ల ఐక్యతా ప్రస్థానాన్ని స్మరించుకున్న సంఘ సభ్యులు.. ప్రత్యేక ఆకర్షణగా 79వ ఉమెన్స్ ఫెలోషిప్ డే


మెదక్, తెలుగు ట్రెండ్స్:

వివిధ క్రైస్తవ డినామినేషన్లు ఐక్యమై చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (CSI)గా ఏర్పడిన 80 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకొని మెదక్ కేథడ్రల్‌లో CSI ఫార్మేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆరాధన, వాక్య సందేశం, ప్రార్థనలు, మహిళల ప్రత్యేక గీతాలు, స్కిట్లతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఉత్సాహంగా సాగింది.


మెదక్ ప్రెసిబిటర్ ఇన్‌చార్జి రెవ dr T. శాంతయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు, భక్తులను ఉద్దేశించి రెవ. Dr, T శాంతయ్య వాక్య సందేశాన్ని అందించారు. యెహోషువ 14:6-13, కీర్తన 16, ఫిలిప్పీయులకు 3:12-16, యోహాను 21:18-23 వాక్య భాగాలను ఆధారంగా చేసుకొని విశ్వాసం, దేవుని పిలుపు, సేవా బాధ్యత, ఆధ్యాత్మిక ప్రస్థానం వంటి అంశాలపై సందేశాన్ని అందించారు.


CSI ఆవిర్భావానికి ప్రధానమైన ఐక్యతా భావాన్ని కొనసాగిస్తూ క్రైస్తవులందరూ ప్రేమ, విశ్వాసం, సేవా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 80 ఏళ్లుగా CSI సంఘం కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవలను స్మరించుకుంటూ భవిష్యత్తులో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.


ఘనంగా 79వ ఉమెన్స్ ఫెలోషిప్ డే


ఈ వేడుకల్లో భాగంగా 79వ ఉమెన్స్ ఫెలోషిప్ డేను కూడా ఘనంగా నిర్వహించారు. ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ శాంతయ్య అమ్మగారు, ఉమెన్స్ సెక్రటరీ లిల్లీ గ్రేస్ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.


మహిళలు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక గీతాలు, ప్రత్యేక గాన కార్యక్రమాలు, స్కిట్లు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. విశ్వాసం, కుటుంబ విలువలు, క్రైస్తవ సేవ, సంఘ ఐక్యత వంటి అంశాలను ప్రతిబింబించేలా స్కిట్లను ప్రదర్శించారు.


చర్చి సేవా కార్యక్రమాల్లో మహిళల పాత్రను ఈ సందర్భంగా అభినందించారు. మహిళలు ఐక్యంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధికి మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.




ఈ కార్యక్రమంలో చర్చి సెక్రటరీ గెలన్ చిత్తరంజాన్ ,కోశాధికారి   గంట సంపత్ పాస్టరెట్ స్టివర్డ్ ప్రభుదయ, చర్చి స్టివర్డ్ దేవా ప్రకాష్తో పాటు చర్చి కమిటీ సభ్యులు సుశీల్, మాణిక్యారావు, జీసీ సునీల్, జాయ్ మూర్రే, సంసన్ సందీప్, సామాలే స్వరూప్, సునీల్, సంజీవరావు, వికాస్, తదితరులు




పాల్గొన్నారు.


చర్చి సెక్రటరీ గెలన్ చిత్తరంజన్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేపట్టగా, చర్చి కమిటీ సభ్యులు, మహిళా ఫెలోషిప్ సభ్యులు, సంఘ సభ్యులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.


ప్రత్యేక ప్రార్థనలు, వాక్య సందేశం, గీతాలు, స్కిట్లతో మెదక్ కేథడ్రల్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. CSI 80 ఏళ్ల ఐక్యతా ప్రస్థానం, 79వ ఉమెన్స్ ఫెలోషిప్ సేవా ప్రయాణాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language