Type Here to Get Search Results !

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాకల జయరాములుకు ఘనంగా జన్మదిన వేడుకలు 72వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంఘం నాయకులు

 


ఘనంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు జన్మదిన వేడుకలు

72వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పద్మశాలి సంఘం నాయకులు

మెదక్, సెప్టెంబర్ 6 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు 72వ జన్మదిన వేడుకలు ఆదివారం చేగుంటలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు, చేనేత రంగ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జయరాములు కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జిల్లాలో పద్మశాలి సంఘాల అభివృద్ధికి మ్యాకల జయరాములు అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని కొనియాడారు. పద్మశాలి సమాజం ఐక్యత, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సభ్యులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

పద్మశాలి సంఘాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. చేనేత కార్మికులు, పద్మశాలి కుటుంబాల సంక్షేమం కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

జన్మదిన వేడుకల సందర్భంగా జయరాములు మాట్లాడుతూ తనపై అభిమానంతో వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి సంఘాల ఐక్యత, అభివృద్ధి కోసం భవిష్యత్‌లోనూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల పరిధిలోని దంతంపల్లి సర్పంచ్ గజేంద్ర నర్సింలు, చేనేత సంఘం నాయకులు ఉడుత శ్రీమన్నారాయణ, ఎర్రగడ్డ కిష్టయ్య, ముదిగొండ శివకుమార్, బైండ్ల బాలరాజ్, వనం నర్సింలుతో పాటు జయరాములు కుటుంబ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language