Type Here to Get Search Results !

పాపన్నపేటలో రూ.7 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం

 


పాపన్నపేటలో డ్రైనేజీ పనులు ప్రారంభం

రూ.7 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్‌ పావని నరేందర్‌ గౌడ్‌

పాపన్నపేట, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): పాపన్నపేట మండల కేంద్రంలోని పెద్ద హరిజనవాడ నుంచి పాతూరు నాయికోటి శ్రీనివాస్‌ ఇంటి వరకు డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్‌ లింగంపేట పావని నరేందర్‌ గౌడ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ పావని నరేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా సుమారు రూ.7 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద హరిజనవాడ నుంచి పాతూరు వరకు సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో కాలనీవాసులు చాలాకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

డ్రైనేజీ నిర్మాణంతో మురుగు నీటి సమస్యకు కొంతమేర పరిష్కారం లభించడంతో పాటు కాలనీవాసులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లింగంపేట నరేందర్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ ఎండీ. సద్దాం, మాజీ ఉప సర్పంచ్‌ ఎండీ. ఖలీం, నాయకులు దోసని సంగమేశ్వర, ముశెట్టి కిష్టయ్య, సుంకరి శివయ్య, బెస్త శ్రీశైలం, వార్డు సభ్యులు ఎండీ. చోటుమియా, గులాం దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language