Type Here to Get Search Results !

సంగారెడ్డిలో 5016 మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం

 


మట్టి గణపతే మహా గణపతి..!

5016 మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

పర్యావరణ పరిరక్షణకు వాసవి మా ఇల్లు సంస్థ సేవలు అభినందనీయం: కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, సెప్టెంబర్ 10 (తెలుగు ట్రెండ్స్, అందోల్ ప్రతినిధి):
పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు.

వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం “మట్టి గణపతే మహా గణపతి” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సుమారు 5 వేల వరకు మట్టి వినాయక విగ్రహాలను పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది కూడా 5016 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. వీటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర పదార్థాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు ప్రకృతిని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వాసవి మా ఇల్లు సంస్థ గత 18 సంవత్సరాలుగా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి, సంస్థ ఉపాధ్యక్షులు మ్యాడమ్ రాధాకిషన్, ఆమేటి మహేందర్, కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు నామా భాస్కర్, జూలకంటి మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language