Type Here to Get Search Results !

సీఎం సహాయ నిధితో నిరుపేదలకు ఆర్థిక భరోసా రూ.38,500 చెక్కు అందజేసిన సర్పంచ్ సరిత మహేష్ గౌడ్

 సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఆర్థిక భరోసా


సర్పంచ్ సరిత మహేష్ గౌడ్


తెలుగు ట్రెండ్స్, నర్సాపూర్: సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామ సర్పంచ్ సరిత మహేష్ గౌడ్ అన్నారు.


చిన్న చింతకుంట గ్రామానికి చెందిన బండ పోచమ్మకు ఆరు నెలల క్రితం కాలికి శస్త్రచికిత్స జరిగింది. వైద్య చికిత్సకు సంబంధించిన ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి రూ.38,500 ఆర్థిక సహాయం మంజూరైంది.


మంగళవారం చిన్న చింతకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధికి సంబంధించిన రూ.38,500 చెక్కును సర్పంచ్ సరిత మహేష్ గౌడ్ బాధిత కుటుంబానికి అందజేశారు.


ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని, అలాంటి వారికి సీఎం సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పెంటయ్య, వార్డు సభ్యులు నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పా


ల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language