Type Here to Get Search Results !

మెదక్ పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం.. కేసు నమోదు చేసి దర్యాప్తు మెదక్, సెప్టెంబర్ 19 (తెలుగు ట్రెండ్స్): మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సెప్టెంబర్ 16న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పాత బస్టాండ్‌లోని ఓకాజ్ డ్రగ్ మార్ట్ ఎదుట కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉండటాన్ని సామాజిక కార్యకర్త మహ్మద్ వసీం గమనించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మెదక్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, నలుపు వర్ణం, సుమారు 5.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు లైట్ బ్లూ రంగు చారల చొక్కా, యాష్ కలర్ ప్యాంట్, లైట్ ఆరెంజ్ రంగు చారల టవల్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి గుర్తింపు, కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మోర్చరీకి తరలించి భద్రపరిచారు. ఈ ఘటనపై Cr.No.413/2026, U/Sec.194 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ఎస్‌ఐ డి. విఠల్కు అప్పగించారు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి మృతుడిని గుర్తించిన వారు, ఆయన కుటుంబ సభ్యులు లేదా మృతుడి వివరాలపై ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

 



మెదక్ పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం.. కేసు నమోదు చేసి దర్యాప్తు

మెదక్, సెప్టెంబర్ 19 (తెలుగు ట్రెండ్స్):
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సెప్టెంబర్ 16న చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పాత బస్టాండ్‌లోని ఓకాజ్ డ్రగ్ మార్ట్ ఎదుట కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉండటాన్ని సామాజిక కార్యకర్త మహ్మద్ వసీం గమనించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మెదక్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, నలుపు వర్ణం, సుమారు 5.5 అడుగుల ఎత్తు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు లైట్ బ్లూ రంగు చారల చొక్కా, యాష్ కలర్ ప్యాంట్, లైట్ ఆరెంజ్ రంగు చారల టవల్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.

మృతుడి గుర్తింపు, కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మోర్చరీకి తరలించి భద్రపరిచారు.

ఈ ఘటనపై Cr.No.413/2026, U/Sec.194 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ఎస్‌ఐ డి. విఠల్కు అప్పగించారు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి

మృతుడిని గుర్తించిన వారు, ఆయన కుటుంబ సభ్యులు లేదా మృతుడి వివరాలపై ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language