Type Here to Get Search Results !

ఆశా వర్కర్ల అరెస్టులకు వ్యతిరేకంగా రాస్తారోకో రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి:

 


ఆశా వర్కర్ల అరెస్టులకు వ్యతిరేకంగా రాస్తారోకో

రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి: సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ

కొల్చారం, సెప్టెంబర్‌ 9 (తెలుగు ట్రెండ్స్ న్యూస్): ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని, వారికి నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కొల్చారం మండల కేంద్రంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 8న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా ర్యాలీగా ఇందిరాపార్క్‌ వద్దకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జి చేయడం, ముందస్తు అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఆశా వర్కర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నించినప్పటికీ అనుమతించకుండా పోలీసులు వ్యవహరించారని ఆమె ఆరోపించారు. మహిళా ఆశా వర్కర్లపై కూడా లాఠీచార్జి చేయడం, దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని నర్సమ్మ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సేవలు అందిస్తూ ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

20 ఏళ్లుగా సేవలు.. ఫిక్స్‌డ్‌ వేతనం లేదు

ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ వారికి ఫిక్స్‌డ్‌ వేతనం లేకపోవడం దారుణమని నర్సమ్మ అన్నారు. చాలీచాలని పారితోషికాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం వెంటనే రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమ్మెకు వెళ్తామని ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు రాములమ్మ, సబిత, నాగమణి, సంశీల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language