Type Here to Get Search Results !

రూ.10 వేలకు గణపతి లడ్డూ సొంతం.. వేలం పాటలో దక్కించుకున్న జర్నలిస్ట్ హరికాంత్

 


రూ.10 వేలకు గణపతి లడ్డును దక్కించుకున్న జర్నలిస్ట్ హరికాంత్

పాపన్నపేట, సెప్టెంబర్ 23 (తెలుగు ట్రెండ్స్):
పాపన్నపేట మండల పరిధిలోని ఆర్కేల్ గ్రామంలో శ్రీ హనుమాన్ మండలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కమ్మరి హరికాంత్ రూ.10 వేలకు గణపతి లడ్డూను దక్కించుకున్నారు.

వినాయకుడి లడ్డూ వేలం పాటకు గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేలం పాట సందర్భంగా పలువురు ఆసక్తిగా పాల్గొనగా.. చివరకు కమ్మరి హరికాంత్ రూ.10 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల బీఆర్‌ఎస్ నాయకులు గడీల శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, ఎల్లంపల్లి గుండయ్య, కుమ్మరి సాయిబాబా, గొల్ల దుర్గయ్య, ముచ్చ రామలింగం, కుమ్మరి సాయిలు, కుమ్మరి హరికృష్ణ, కుమ్మరి ఆంజనేయులు, కుమ్మరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

Hollywood Movies

🌐 Select Language