మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన చైర్పర్సన్ లావణ్య నాగరాజు
రామాయంపేట, తెలుగు ట్రెండ్స్:
రామాయంపేట పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ఓద్ది రాజలింగం మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పరామర్శించారు. రాజలింగం మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న చైర్పర్సన్ లావణ్య నాగరాజు, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని భరోసా ఇచ్చారు.
మృతుడి కుటుంబానికి ఆపద సమయంలో సహాయం అందించడం పట్ల స్థానికులు చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అవసరమైన వారికి తన వంతు సహాయం అందిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ భైరం కుమార్, మాజీ కౌన్సిలర్ బొర్ర అనిల్, భైరం శంకర్, అసది రాజు, భైరం రమేష్, గావు భాస్కర్, బొట్ల బాబు, ఓద్ది స్వామి, భైరం పెద్ద స్వామి, కుందెన రాములు, బొర్ర రమేష్, బొర్ర నర్సింలు, కుందెన అశోక్ తదితరులతో పాటు 1వ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
