Type Here to Get Search Results !

జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం డ్యూటీకి గైర్హాజరైన వైద్యురాలికి షోకాజ్‌ నోటీసులు.. ప్రైవేట్‌ డాక్టర్‌తో వైద్యం చేయించడంపై విచారణ

 




వైద్యుల విధుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం

డ్యూటీకి గైర్హాజరైన వైద్యురాలికి షోకాజ్‌ నోటీసులు

జహీరాబాద్‌, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్‌): జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల విధుల నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ వైద్యులు అందుబాటులో లేకపోవడం, వైద్యుల కొరతతో పాటు డ్యూటీ డాక్టర్‌ స్థానంలో ప్రైవేట్‌ వైద్యుడు విధులు నిర్వహించి రోగులకు చికిత్స అందించిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మంత్రి పరిశీలించి ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తుతో మాట్లాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశించారు.

విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు

ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో ప్రైవేట్‌ వైద్యుడు విధులు నిర్వహించడం వంటి అంశాలపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యురాలికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు పేద ప్రజలు ఎంతో నమ్మకంతో వస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు గైర్హాజరు కావడం, వారి స్థానంలో ప్రైవేట్‌ వైద్యులను విధుల్లో ఉంచడం వంటి పరిణామాలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

ఘటనపై విచారణ పూర్తిచేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య సేవలు నిరంతరం అందేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language